Good News For Ap People’s రాష్ట్రంలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Good News For Ap People’s

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ( Good News For Ap People’s ) 3 రకాలైన శుభవార్తలు చెప్పడం జరిగింది.. ఆ శుభవార్తలు ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం..

ఏపీ ప్రజలకు 3 శుభవార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా ఈరోజుటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం మూడు రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. అవి :-

WhatsApp Group Join Now
  1. కొత్త పెన్షన్లు
  2. రేషన్ కార్డులు
  3. పింఛన్ తీసుకోలేని వారికి కొత్త మార్గదర్శకాలు

కొత్త పెన్షన్లు

ఏపీ పింఛన్ దారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ శుభవార్త చెప్పడం జరిగింది. త్వరలో కొత్త పెన్షన్లు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పుడు వెళ్లి పెన్షన్ అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలు చూద్దాం.

కొత్త పింఛన్ల జారీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక పెద్ద శుభవార్త ప్రకటించింది. డిసెంబరు నుండి, రాష్ట్రం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుంది, వీటిని గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సమర్పించవచ్చు.

పారదర్శకత కోసం గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక నిర్వహిస్తారు. ప్రస్తుతం రెండు లక్షలకు పైగా కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా, అనర్హులు చాలా మంది వ్యక్తులు గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు పొందారని వారు కనుగొన్నారు. దీనిని పరిష్కరించడానికి, ప్రస్తుత పరిపాలన కొత్త పెన్షన్లను ఆమోదించేటప్పుడు జాగ్రత్తగా మరియు క్షుణ్ణంగా స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. జనవరిలో జరిగే జన్మభూమి-2 కార్యక్రమంలో కొత్త పింఛన్లు పంపిణీ చేయాలన్నారు.

Also Read :- భర్త చనిపోయిన మహిళ ( వితంతు పెన్షన్ ) కొత్త జీఓ రిలీజ్

గతంలో అప్లై చేసిన పెన్షన్ స్టేటస్

చాలామంది మన రాష్ట్రంలో గతంలో పెన్షన్ అప్లై చేశారు… ప్రస్తుతం ఆ పెన్షన్ పెండింగ్ లో ఉందో.. రిజెక్ట్ అయిందా మీ మొబైల్ లోనే స్టేటస్ తెలుసుకోండి..

NTR Bharosa Pension Status Click Here

రేషన్ కార్డులు

రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. డిసెంబరు 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

అన్ని ప్రభుత్వ పథకాలు అందాలంటే కీలకమైన రేషన్ కార్డు కోసం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎదురు చూస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా.. వైకాపా ప్రభుత్వం మంజూరు చేయకుండా రిక్తహస్తం చూపింది.ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకూ చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించారు. అన్నింటినీ పరిశీలించి అర్హులకు సంక్రాంతి కానుకగా అందిస్తారు.

మారనున్న డిజైన్లు

ప్రస్తుతం ఉన్న రేషన్కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతోంది. ఇది పూర్తయ్యాక కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు.ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము..

రాష్ట్ర వ్యాప్తంగా 14,082 బీపీఎల్‌ రేషన్‌ కార్డుల రద్దు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హులకు ఎవరికైనా రేషన్ కార్డ్స్ ఉన్నట్లయితే.. రేషన్ కార్డ్స్ తొలగించడం జరుగుతుంది.. మీ రేషన్ కార్డ్ ఆన్లైన్ లో ఉందో లేదో మీ స్టేటస్ తెలుసుకోండి..

Ap రేషన్ కార్డు స్టేటస్ Click Here

పింఛన్ తీసుకోలేని వారికి కొత్త మార్గదర్శకాలు

ఇకనుంచి మన రాష్ట్రంలో ప్రతి నెల దూర ప్రాంతాల్లో ఉండి రాలేక నెల. నెల. పెన్షన్ తీసుకోలేని వాళ్ళు మూడు నెలలకు ఒకసారి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

  • పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ(నవంబర్ 21) నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
  • వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది.
  • NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది.
  • వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్ ను రద్దు చేస్తామంది.
  • అలాంటి వారు తగిన కారణము చేత WEA/WWDS/ MPDO/ కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

10 వ తరగతి అర్హతతో రేషన్ డీలర్స్ జాబ్స్ రిలీజ్ Click Here
రైల్వే శాఖలో 1791 జాబ్స్ రిలీజ్ Click Here
గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు రిలీజ్ Click Here
విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు Click Here
ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ Click Here

🔎 Related TAGS

good news for ap people, good news for visakha people, cm chandrababu good news to ap people, good news for ap,good news, good news to womens, chandrababu good news, ap live news, good news to ap unemployement youth, ap today news, ap news today, good news from indonesia, ap latest news, visakha people about roads, today news live, today telugu news, telugu news today

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group