Table of Contents
Ap Pensioners Latest News 2024
Ap Pensioners Latest News 2024 :: నేడు రేపు సామాజిక పింఛన్లు తనిఖీలు.. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు వెరిఫికేషన్ ప్రారంభం.. ఇక్కడ ఎవరైనా అనర్హులుగా తేలితే వీళ్ళ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి రాదు.. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంచుకున్నారు.. పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం..
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు తీసుకునే లబ్దిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 9, 10 తేదీల్లో తనిఖీలు చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్ బ్యాక్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధమైన తనిఖీలు చేపట్టనున్నారు.
భోగస్, అనర్హుల పింఛన్ల విషయంపై వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని సాకుగా చెప్పి పింఛన్ల వెరిఫికేషన్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్, విదివిధానాలను సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు జి వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
తొలివిడతగా చేపట్టనున్న పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల 9న ఒక్కరోజే పూర్తి చేసి, 10న సాయంత్రం 5 గంటలకల్లా ప్రభుత్వానికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాలి. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పింఛనుదారులను ప్రత్యక్షంగా కలిసి యాప్ వివరాలు సేకరించనుంది.
13 అంశాలతో ప్రశ్నావళి?
సామాజిక పింఛన్ల తనిఖీకి వెళ్ళిన బృందానికి ప్రభుత్వం 13 ప్రశ్నలు సూచించింది. ప్రశ్నల వివరాల్లోకి వెళితే..
- పింఛనుదారుని స్టేటస్ ను యాప్లో నివాసం ఉంటున్నారా? మరణించారా? అందుబాటులో లేరు అనే కాలమ్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
- కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.12 వేలు ఆపైన ఉందా?
- లబ్ధిదారుని కుటుంబానికి మూడెకరాలు కంటే ఎక్కువ మాగాణి, పదెకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?
- కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా? (ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహాయింపు) అవును, లేదు అనే కాలమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- అదే విధంగా కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా?
- కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా?
- మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?
- కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
- కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా?
- పింఛన్దారు వికలాంగత్వం కలిగి ఉన్నారా?
- పింఛన్ దారుని రీ అసెస్మెంట్కు (వైద్య పరీక్షలకు) సిఫార్సు చేస్తున్నారా?
ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్దారుని ఫొటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది.
Pension Verification Questions
పైన చెప్పిన అన్ని క్వశ్చన్స్ కి గవర్నమెంట్ ఇచ్చిన యూజర్ మాన్యువల్ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని.. పెన్షనర్ని ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారో పూర్తి వివరాలు తెలుసుకోండి..
పెన్షన్ వెరిఫికేషన్ కోసెన్స్ :: Click Here
Pension Verification GO
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసినటువంటి జీవో ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోగలరు..
Pension Verification GO :: Click Here
డిస్టిక్ వైస్ పెన్షన్ వెరిఫికేషన్ చేయబడు సచివాలయం లిస్ట్
ఫస్ట్ అఫ్ ఆల్ క్రింద ఇచ్చిన లిస్టులో ఉన్న సచివాలయాలకు మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు.. తర్వాత మళ్లీ కొత్త లిస్టు రిలీజ్ అవుతుంది..
సచివాలయం వైజ్ లిస్ట్ :: Click Here
పెన్షన్లు తొలగింపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రింది వీడియోని క్లిక్ చేసి తెలుసుకోండి..
Demo Video :: Click Here
జీవో పిడిఎఫ్ | Click Here |
ఎంపిక చేయబడిన సచివాలయలా లిస్ట్ | Click Here |
సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు | Click Here |
ఇవి కూడా చదవండి
పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు
ఆడబిడ్డ నీది స్కీం పూర్తి వివరాలు
🔎 Related TAGS
ntr bharosa pension 2024, ntr bharosa pension latest news, ap pension latest news, ntr pensions application 2024, ap latest schemes, ap pension latest update, ap pension latest news telugu, ap pension news 2024, ap pensioners latest news, pensioners pensions, ap pensions latest news, latest ap elections 2024 survey, sss pension november 2024, ap pensioners
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇