Table of Contents
Ap Former’s Good News: జస్ట్ మెసేజ్ చేస్తే చాలు!
Ap Former’s Good News :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.. రైతు హాయ్ అంటే చాలు.. ధాన్యం కొలుగోలు మీ వాట్సాప్ నుంచే చేయొచ్చు.. ఎక్స్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Big Dicision Ap Former’s
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించేందుకు ప్రయాస పడుతూ ఉంటారు.. సరైన కొనుగోలు ధర లేకుండా ధాన్యం కొనుగోలు డీలర్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే ఇక ఇబ్బంది అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.. రైతు హాయ్ అంటే చాలు ధాన్యం కొనుగోలు చకచక జరిగిపోతుందన్నారు.. రైతన్నలు దాన్యం విక్రయించేందుకు వాట్సాప్ సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు..
7337359375 నెంబర్ తో ఇక సేవలు ఉండనున్నాయని తెలిపారు.. రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలను అందిస్తామన్నారు.. రైతులు నెంబర్ కు హాయి అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవలు నియోగంపై మార్గదర్శకం చేస్తుందన్నారు..
- రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చెయ్యాలి.
- తరువాత రైతు పేరును ధ్రువీకరించాలి.
- తరువాత దాన్ని నమ్మదలిచిన కొనుగోలు కేంద్రo పేరును ఎంచుకోవాలి.
- నెక్స్ట్ మీరు ఏ డేట్ న అమ్మాలనుకున్నారో డేట్ ని ఫిక్స్ చేయాలి.
- ఆ తర్వాత మీరు ఏ సమయం లో కూడా నిర్ణయించుకోవాలి.
- తరువాత మీ దాన్ని ఏ రకం సంబంధించిన రకం ఎంచుకోవాలి.
- నెక్స్ట్ ఎంత మేరా దాన్యం అనగా ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారో కూడా ఎంచుకోండి.
తర్వాత ఒక ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్టు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుందన్నారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతులు స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్ లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం విశేషమని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు..
వాట్సాప్లో HI చెబితే ధాన్యం కొనుగోలు: మంత్రి నాదెండ్ల
రైతులు ధాన్యo ఎలా బుక్ చేసుకోవాలో డెమో వీడియో..
- రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
- 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
- ‘ఏ కేంద్రం, ఏ రోజు, ఏ టైమ్, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారో మెసేజ్ పెట్టగానే స్లాట్ బుక్ అవుతుంది.
- ఆ వెంటనే కూపన్ కోడ్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం ధాన్యం విక్రయించవచ్చు.
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
బ్యాంకు కు వెళ్లకుండా NPCI లింక్ చేసే విధానం | Click Here |
MLC అప్లికేషన్ స్టేటస్ | Click Here |
వృద్ధులకు 5 లక్షల ఉచిత బీమా కార్డ్స్ | Click Here |
కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ఉన్నాయి క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇