Table of Contents
Ration Dealer Jobs Release: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్!
Ration Dealer Jobs :: ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియమకానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం..
రేషన్ డీలర్స్ నోటిఫికేషన్ 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీరాల మరియు రేపల్లె రెవెన్యూ డివిజన్‌లలో 192 రేషన్ డీలర్ పోస్టుల ( Ration dealer jobs ) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 28, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. చీరాల మరియు రేపల్లె రెవెన్యూ డివిజన్‌లలో 192 రేషన్ డీలర్లు మరియు దుకాణాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
మొత్తం రేషన్ డీలర్ల పోస్టులు
రేపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 46 రేషన్ డీలర్లు, మూడు విభజిత దుకాణాలు మొత్తం 49 రేషన్ డీలర్లు, దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆర్డిఓ నేలపు రామలక్ష్మి తెలిపారు. ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్రింది టేబుల్ లో క్లియర్ గా ఇచ్చాను చూడండి.
S.NO | రేపల్లె మండలం | Number of Posts |
1 | రేపల్లె మండలం | 8 |
2 | నగరం | 8 |
3 | చుండూరు | 8 |
4 | చెరుకుపల్లి | 6 |
5 | నిజాంపట్నం | 5 |
6 | బట్టిప్రోలు | 5 |
7 | అమర్తలూరు | 3 |
8 | కొల్లూరు | 3 |
9 | వేమూరు | 3 |
అలాగే చీరాల చీరాల రెవిన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 139 రెగ్యులర్ డీలర్ షాపులు, 4 కొత్త షాపులు మొత్తం 143 రేషన్ దుకాణాలు, డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు చీరాల ఆర్డీవో పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు.
విద్యార్హతలు
- రేపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు, విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించారు.
- డీలర్ పోస్టుకు, దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి.
- వీరిపై ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు.
- అలాగే చదువుకుంటున్న వారు, విద్యా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వయస్సు
- ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాలనుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వుడు కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది.
ఇవి కూడా చదవండి
రైతులకు గుడ్ న్యూస్ రూ. 4,500 కోట్లు రిలీజ్
ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్
అప్లై చేసుకునే విధానం
రేపల్లె మరియు చీరాల రెవెన్యూ డివిజన్‌లలో డీలర్ పోస్టులకు దరఖాస్తులు సంబంధిత ఆర్డీవో కార్యాలయాలలో సమర్పించాలి. దరఖాస్తు చివరి తేది నవంబర్ 28, 2024. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్‌లను జతచేయాలి. ఇతర వివరాల కోసం రేపల్లె లేదా చీరాల ఆర్డీవో కార్యాలయాలను సంప్రదించండి.
కావలసిన దృవీకరణ పత్రాలు
ఈ ( Ration dealer jobs ) పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే,, క్రింద చెప్పిన ప్రతి డాక్యుమెంటు తప్పనిసరిగా కావలెను.
- పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు
- వయసు ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం ( ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఏదైనా పర్లేదు )
- మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
- దివ్యాంగులు అయితే ఆ కేటగిరికి సంబంధించిన సదరం సర్టిఫికెట్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులకు చివరి తేదీ | నవంబర్ 28, 2024 |
దరఖాస్తుల పరిశీలన | నవంబర్ 29, 2024 |
అర్హుల జాబితా ప్రకటన | నవంబర్ 29, 2024 |
ఎంపికైన వారికి రాత పరీక్ష | డిసెంబర్ 2, 2024 |
రాత పరీక్షల ఫలితాలు | డిసెంబర్ 3, 2024 |
అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ | డిసెంబర్ 5, 2024 |
తుది జాబితా వెల్లడి | డిసెంబర్ 6, 2024 |
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇